గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులకు నిమజ్జనం గురించి సూచనలు చేసిన ఎస్ఐ తిరుపతి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా డీజే లకు ఎటువంటి అనుమతి లేదు.
జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నిబంధనను అతిక్రమించినట్లయితే డీజే యజమానులు మరియు ఉత్సవ కమిటీ నిర్వాహకులపై చర్యలు తీసుకొనబడును.
నిమజ్జనం ఊరేగింపులో రెచ్చగొట్టే ప్రసంగాలు, అశ్లీల నృత్యాలు చేయరాదు.
ఊరేగింపుగా వెళ్లే దారిలో కరెంటు వైర్లు తగలకుండా జాగ్రత్త తీసుకోవలెను.
చెరువుల వద్ద నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను అనుమతించరాదు. గజ ఈతగాళ్లు మాత్రమే నీటిలో దిగవలెను.
నిమజ్జనం చేయు ప్రదేశంలో వెలుతురు ఉండేట్లు చూసుకోవలెను.
రాత్రి 10 గంటల లోపు నిమజ్జనం పూర్తి చెయ్యాలని నిర్వాహకులకు సూచించారు