బయ్యారం మండలంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
హిందూ మతంలో శ్రీ కృష్ణాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడంతో పాటు ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ రోజున గోపాలుడిని పూజించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లం, కలిపిన వెన్న, పెరుగు, మీగడను, నైవేద్యంగా సమర్పించారు. స్థానిక గాంధీ సెంటర్,ముత్యాలమ్మ రోడ్ ,రామాలయం రోడ్,మెయిన్ రోడ్ నందు ఉయ్యాలు కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టి రకరకాల పాటలు కీర్తనలు ఆలపించారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి వాటిని కొట్టేందుకు యాదవులు పోటీపడ్డారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలకు కృష్ణ మందిరాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం మహావిష్ణువు తన ఎనిమిదవ అవతారంగా అవతరించిన ఈ కృష్ణాష్టమి రోజున గృహాల్లో భక్తులు ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించారు.