సెక్యూరిటీ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

సెక్యూరిటీ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కార్పొరేట్ సెక్యూరిటీ విభాగం జనరల్ మేనేజర్ సిహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో వారు పర్యటించారు. ముందుగా రామగుండం-3 ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ గుంజపడుగు రఘుపతిని కలిసి ఏరియాలో సెక్యూరిటీ పరంగా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సెక్యూరిటీ జనరల్ మేనేజర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఏరియాలో పర్యటించిన సందర్భంగా ఇంచార్జ్ జి.యం. రఘుపతి ఇతర అధికారులతో కలిసి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఓసిపి 1, 2 ఉపరితలగనులలో ఉన్న చెక్ పోస్లులు, స్టోర్స్, స్క్రాప్ యార్డ్, వ్యూ పాయింట్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ యొక్క ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం సిబ్బంది పాత్ర కీలకమని, గనులు, విభాగాలలో సింగరేణికి సంబంధించిన సామగ్రి దొంగతనం జరగకుండా చూడాలని అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారి పర్యటనను పురస్కరించుకొని ఏరియా సెక్యూరిటీ, పర్సనల్ విభాగం, ఓ.సి-2 గని అధికారులు వారిని సన్మానించారు.పర్యటనలో భాగంగా వారితోపాటు అడ్రియాల ప్రాజెక్ట్ అధికారి కొలిపాక నాగేశ్వరరావు, ఓ.సి.-2 ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.వెంకటరమణ, ఏరియా సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, పర్యావరణ అధికారి పి.రాజారెడ్డి, అధికారులు కె.చంద్రశేఖర్, గుర్రం శ్రీహరి, పి.రాజేశం, మథిన్ హుస్సేన్, జూనియర్ ఇన్స్ పెక్టర్ టి.లింగయ్య, ఇతర సెక్యూరిటి సిబ్బంది పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment