ఆదివారం లయన్స్ క్లబ్ సెంటనరీ కాలనీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీర్ అయిన నందమూరి రామకృష్ణ ని ఘనంగా సన్మానించడం జరిగింది.వారు ఆర్జి3 డివై ఎస్సి గా విధులు నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే ఇప్పుడు మేకింన్ ఇండియాగా అభివృద్ధి చెందుతుంది అంటే అందులో ఇంజనీర్ల పాత్ర చాలా పెద్దది అని సంక్షేమ సాంఘిక రవాణా ప్రాజెక్టులు ప్రతి దానిలో ఇంజనీర్ పాత్ర ఉంటుందని అన్నారు. దేశానికి సేవ చేయడంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని అని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్,లైన్ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి, డాక్టర్ శరణ్య మారుతి,కాటo సత్యం,క్లబ్బు కోశాధికారి కళాధర్ రెడ్డి,తీగల శ్రీధర్,గుండం రవి, సాగర్,మధు,సంజీవ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇంజనీర్స్ డే సందర్భంగా ఆర్జీ3 సివిల్ ఇంజనీర్ ని ఘనంగా సన్మానం చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు
Published On: September 15, 2024 5:23 pm