మంచిర్యాల రీజియన్ నూతన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన యం.డి.యూసుఫ్ చౌటుపల్లి ని బుధవారం రామగుండంలోని వారి కార్యాలయం నందు రామగుండం-3 ఏరియా పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి శాలువాతో వారిని సన్మానించారు. అనంతరం రామగుండం-3 ఏరియాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు సహకారం అందించాలని కోరారు.వారితోపాటు ఐఈ డిజియం కె.చంద్రశేఖర్, సీనియర్ పర్సనల్ అధికారి పి.రాజేశం, తదితరులు పాల్గొన్నారు.