సింగరేణి దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేయడం జరిగిందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వేంకటేశ్వర్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రామగుండం-3 ఏరియా నుండి ఓ.సి-1 అడిషనల్ మేనేజర్ ఎ.కోటయ్య, సివిల్ విభాగం డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.రామకృష్ణ, ఓ.సి-2 ఇ.పి.ఆపరేటర్ కె.లక్ష్మినారాయణ, ఓ.సి-1 జనరల్ మజ్దూర్ పి.రాజయ్య, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా నుండి డిప్యూటి మేనేజర్ డి.అశోక్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.యాదగిరి, సీనియర్ మైనింగ్ సర్దార్ కె.సంపత్ రావు, మల్టీ జాబ్ వర్కర్ మరియా దాస్ లు ఎంపిక కావడం జరిగిందని, వీరిని స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణం నందు నిర్వహించే సింగరేణి దినోత్సవ వేడుకల్లో సన్మానించడం జరుగుతుందని వారు తెలిపారు.