కామ్రేడ్ బానోతు మంగ్యాకు విప్లవ జోహార్లు.

కామ్రేడ్ బానోతు మంగ్యాకు విప్లవ జోహార్లు.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

 బయ్యారం మండలం కారుకొండ శివారు చర్లపల్లి తండాకు చెందిన బానోతు మంగ్యా అనారోగ్యంతో గత రాత్రి మృతి చెందాడు. సిపిఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ సభ్యుడిగా అనేక ఆటుపోట్లు, కష్టాలు ఎదురైన సమయంలో కామ్రేడ్ మంగ్యా పార్టీ వెనకాల దృడంగా నిలబడ్డాడు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలపై దాడులు, నిర్బంధం కొనసాగుతున్న కాలంలో పార్టీ తరఫున ఉమ్మడి కంబాలపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసి నెల రోజులపాటు పంచాయతీలో నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించి పార్టీ గెలుపుకు కృషి చేశాడు.వయోభారం తీవ్ర అనారోగ్యం వెంటాడుతున్న చివరిదాకా పార్టీ వెనకాల నిలిచిన కామ్రేడ్ మంగ్యా మృతదేహంపై పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి మోకాళ్ళ మురళీకృష్ణ, పార్టీ మండల నాయకులు మేకపోతుల నాగేశ్వరరావు, కొదుమూరి నాగేశ్వరరావు,రవి తదితరులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు

Join WhatsApp

Join Now

Leave a Comment