విద్యుత్ అమరవీరులకు విప్లవ జోహార్లు.
-మండలంలోని సుద్దరేవులో విద్యుత్ అమరులకు నివాళులర్పించిన న్యూడెమోక్రసీ పార్టీ.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రైవేటీకరించి వినియోగదారులపై విపరీతమైన చార్జీలభారం మోపిన నాటి చంద్రబాబు ప్రభుత్వం పై వామపక్ష పార్టీలు నిర్వహించిన దశల వారి ఉద్యమంలో ఆ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు.
బయ్యారం మండలం సుద్దరేవులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో భూడవారం విద్యుత్ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గౌని ప్రసంగీస్తూ 2000 సంవత్సరం ఆగస్టు 28న వామపక్షాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రక్తపుటేరులో ముంచి ముగ్గురిని బలి తీసుకొని అనేక మందిని క్షతగాత్రులను చేశారని,నేడు విద్యుత్ రంగం ఎంతో కొంత ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజలకు కొంతమేరకైనా ఉపయోగపడుతుందంటే అది నాటి వీరోచిత పోరాట ఫలితమేనని, విద్యుత్ అమరవీరులు ప్రపంచ బ్యాంకు, ప్రైవేటీకరణ, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అమరులయ్యారని, వారి అమరత్వం స్ఫూర్తితో ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వాములకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనకై ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్)న్యూమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కార్యదర్శి మోకాళ్ళ మురళీకృష్ణ, పార్టీ నాయకులు బాణోత్ నరసింహ, సూర్నపాక రాంబాబు, పూనెం లింగన్న, తొగరు కొమరయ్య, మేకపోతుల నాగేశ్వరరావు, భూక్య రాము, చింత కృష్ణ, జనార్ధన్, పూనెం వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.