ఆర్జీ-3 ఏరియాలోని ఓసిపి-2 మైన్ వద్ద జరిగిన గేటు మీటింగ్ ఆర్జి-3 బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ ఎంఆర్సి రెడ్డి ఏఐటీయూసీ అధ్యక్షతన, ఓ సి పి -2 పిట్ సెక్రెటరీ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అడిషనల్ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ మిర్యాల రంగయ్య , డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ వైవి రావు , సెంట్రల్ సెక్రటరీ కామ్రేడ్ జూపాక రామ్ చందర్ , కార్మికుల ఉద్దేశించి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓ సి పి -2 లో జరిగిన యాక్సిడెంట్ లో సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనింగ్ స్టాప్ ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడడం జరిగింది. వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్న వాస్తవ లాభాలను ప్రకటించలేదు. అలాగే వచ్చిన లాభాలలో35% వాటాను కార్మికులకు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం పత్రం రాగానే స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈపీ ఆపరేటర్ల కు రావాల్సిన ప్రమోషన్ల విషయం కూడా త్వరగా పూర్తి చేయాలని కోరడం జరిగిందని, ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా వర్షాకాలం రాగానే కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రెస్ట్ హాల్, బాక్సులు బురద నీటిలో మునిగిపోవడం వలన వారు ఎదుర్కొంటున్న సమస్యపై యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన రెస్ట్ హాల్ మరియు కార్మికుల బాక్సులను వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే త్రాగునీరు కూడా కలుషితం కాకుండా చూడాలని, యాజమాన్యం ఈ సమస్యను తొందరగా పూర్తిచేయాలని ఏఐటీయూసీ కోరడం జరిగింది. ఈ మీటింగ్ లో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ సంపత్,పిట్ కమిటీ సభ్యులు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సాదిక్,రాజు, డెలిగేట్స్ సురేందర్,రాజయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్, పోశం, నరేష్, లక్ష్మణ్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించండి
Updated On: August 1, 2024 3:49 pm