రేషన్ షాపు…పరేషాన్:-భర్త పేరుపై ఉన్న రేషన్ షాప్ ఇష్టారితిన భార్య నడిపిస్తున్న వైనం.
-రేషన్ షాపు కాదు, ఇది నా సొంతిల్లు అంటూ భార్య నిర్వాకం.
కేసముద్రం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
రేషన్ షాప్ డీలర్ యొక్క ఆగడాలు రోజురోజు మితి మీరిపోతున్నాయి. భర్త పేరు పైన రేషన్ షాపు ఉంది, కానీ భర్తకు ఎటువంటి సంబంధం లేనట్టు అన్నట్టుగా ఉంది. భర్త వ్యక్తిగతంగా ఓ గ్రానైట్లో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు, షాపు విషయానికి వస్తే అతని భార్య రేషన్ షాపును తనకిష్టం వచ్చిన టైంలో నడుపుతూ అప్పుడప్పుడు రోజువారి బయట పనులకు వెళ్తూ వినియోగదారులకు నానా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. సొంత ఇంట్లో రేషన్ షాప్ ను నడుపుకుంటూ ఇంటి చుట్టూ పరదాలను కప్పుకొని ఏదో ముసుకు సాటునా రేషన్ షాపును నిర్వహిస్తున్నాడు. మరియు రేషన్ షాపు నిర్వాహణలో స్వయంగా వినియోగదారుల నుండి రేషన్ బియ్యాన్ని తూకంలో కిలో నుండి రెండు కిలోల వరకు తక్కువ తూకం పెట్టడం జరుగుతుంది. తిరిగి స్వయంగా రేషన్ షాపు డీలరే వినియోగదారుల నుండి కిలో రేషన్ బియ్యానికి ఎనిమిది రూపాయల చొప్పున ఖరీదు చేసి కొనుగోలు చేయడం జరుగుతుందని వినియోగదారులు తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఒక వినియోగదారుడు ఖాళీ బస్తాతో ఇంటికి వెళుతున్న క్రమంలో ఒక యువకుడు రేషన్ బియ్యం తీసుకోలేదా అని అడగగా వినియోగదారుడు సమాధానంగా 8 రూపాయల చొప్పున రేషన్ షాపు వారికే విక్రయించానని చెప్పడం జరిగింది. ఇంతకుముందు తూనికల కొలతల విషయంలో వినియోగదారులను కాంటాకు రెండు నుండి మూడు కిలోలు తక్కువ జోకుతూ ఉంటె ఇంతకుముందు జిల్లా సివిల్ సప్లై అధికారి ద్వారా ఈ షాపుపై కేసు కూడా నమోదు కాబడి ఉంది. రేషన్ షాపు నిర్వాహణ విషయంలో తన సొంత ఇంటిలో రేషన్ షాప్ ను నడుపుకుంటూ వారికి అనుకూలమైన టైములో రేషన్ బియ్యాన్ని వినియోగదారులకు ఇస్తున్నారు. వినియోగదారులు రేషన్ బియ్యం కొరకు అతని ఇంటికి వెళ్ళినప్పుడు, చార్జింగ్ లేదు, మిషన్ పనిచేస్తలేదు, సాయంత్రం రాపో, పొద్దుగాల రాపో అని నానా ఇబ్బందులను గురి చేస్తున్నారని, ఇట్టి రేషన్ షాప్ పై పలుమార్లు అధికారులకు ఇంతకుముందు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదని ఇకనైనా మహబూబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా సివిల్ సప్లై అధికారి మరియు కేసముద్రం మండల ఎమ్మార్వో తక్షణమే స్పందించి ఇకనైనా ఇట్టి రేషన్ షాపుపై చర్యలు తీసుకుని తన సొంత ఇంటి నుండి గ్రామపంచాయతీ మధ్యలోకి అట్టి రేషన్ షాపు మార్పించి రేషన్ షాపుపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.