ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు 

 

 

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంగళవారం రోజున ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. లక్ష్మీనారాయణ  జండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ అంతా నిజాం పరిపాలనలోనే ఉండేదని వారి అరాచకాలకు, అకృత్యాలకు ఎంతోమంది బలయినారని అప్పటి భారత ప్రభుత్వ హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయి పటేల్  నిజాం రాజు పై నిర్వహించిన పోలీస్ చర్య కారణంగా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 ,1948 సంవత్సరంలో స్వాతంత్రం సిద్ధించినందున ఆరోజును తెలంగాణ విమోచన దినంగా నిర్వహించుకునే వారని ఈ సంవత్సరం నుండి దానిని ప్రజాపాలన దినోత్సవం గా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ కృష్ణ, చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్ ముకుందము ,రజిత బోధనేతర సిబ్బంది అశోక్, శ్రీనివాస్, సుధాకర్ ,రాజు, దుర్గరాజు, సురేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version