ఆర్.జీ-3 మరియు ఎ.పి.ఎ ఏరియాలో  ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఆర్జీ3 జీ.ఎం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన తెలంగాణ సమరయోధుడు, తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి వేడుకల్లో భాగంగా వారి చిత్రపటానికి ఆర్.జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్  కవి, రచయిత, అధ్యాపకునిగానే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం విశాలాంధ్రకు వ్యతిరేకంగా పోరాటం      మొదలుపెట్టాడని,  వివిధ దశలలో కొనసాగిన తెలంగాణ ఉద్యమములో మొదటి నుండి తెలంగాణ సాదనలో అహర్నిశలు కృషి చేసిన ఆచార్య జయశంకర్  తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శ్రీఘంగా జరుగుతుందనేవారని, రాష్ట్ర అభివృద్ధికి యువత ముందుండాలని వారు అనేవారని, వారి  జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని మనకు కేటాయించిన లక్ష్యాలను సాధిస్తూ సంస్థ పురోభివుద్దికి తోడ్పడుతూ తద్వారా రాష్ట్ర అభివృద్దికి కృషి చేయాలని  అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఎం.రామచంద్రరెడ్డి, ఎస్ వో టూ జీఎం జి.రఘుపతి, ఫైనాన్స్ ఎజిఎం పి.శ్రీనివాసులు, అధికారుల సంఘం ప్రతినిధి జి.శ్రీనివాస్, ఐఎన్టియుసి ప్రతినిధి రవికుమార్, అధికారులు కె.చంద్రశేఖర్, ముప్పిడి రవీందర్ రెడ్డి, డి.జనార్దన రెడ్డి, బి.వి.సత్య నారాయణ, ఈ. నాగేశ్వర్ రావు, రాజేంద్ర ప్రసాద్, ఈ.లక్ష్మీ నారాయణ తో పాటు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment