టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన ప్రజాజ్యోతి జిల్లా స్టాఫర్ సపాటి అజయ్ కుమార్ ఎన్నికయ్యారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా మూడవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్,జిల్లా కార్యదర్శి బుక్క రాంబాబు,అక్రిడేషన్ కమిటీ సభ్యుడు పాల్వాయి జానయ్య,జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఆయన పేరును ప్రకటించారు.జర్నలిస్టుల హక్కుల పోరాటానికి తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు.ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర,జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.