బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన వాక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి ప్రజలందరూ మద్దతు తెలుపాలని రామగిరి మండల అధ్యక్షులు కొండు లక్ష్మణ్ కోరారు. ఇస్లాం మతానికి చెందిన కొందరు పెద్దలు మంచి ఉద్దేశంతో ఈ యొక్క వాక్ఫ్ బోర్డ్ ని ఏర్పాటు చేశారు దీని యొక్క ఉద్దేశం తమకు కేటాయించిన భూములని మంచి పనులకు అనగా పిల్లల చదువు కోసం పాఠశాలలని అదేవిధంగా పేదవారి ఆరోగ్యరీత్యా హాస్పిటల్స్ కట్టడం కోసం మరియు మంచి పనులకై ఈ భూములను ఉపయోగించాలని ఈ బోర్డు ఉద్దేశం. ఇప్పుడున్న కొందరు ఈ వాక్ఫ్ బోర్డు ని అడ్డుపెట్టుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరి పేదవారి భూములని కబ్జా చేస్తు సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలని కూడా కబ్జా చేసి మత కల్లోలలు రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిర్ములించడానికి బీజేపీ ప్రభుత్వం వాక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం జరిగింది కావున భారతదేశ ప్రజలందరూ ఈ బిల్లుకి మద్దతు తెలుపలని కోరారు. ఇప్పుడు సోషల్ మీడియా లో వస్తున్న స్కానర్ ని స్కాన్ చేసి మీ యొక్క మద్దతుని మెయిల్ ద్వారా పంపి మీ యొక్క గొంతుని పార్లమెంట్ లో వినిపించేలా చేయాలనీ కోరారు.
దయచేసి ప్రజలందరూ వాక్ఫ్ బోర్డ్ చట్ట సవరణకు మద్దతు ఇవ్వండి
Published On: September 14, 2024 8:23 pm