పొంగి పొర్లుతున్న వాగులు.గ్రామాలకు రాక పోకలకు అంతరాయం.ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి.
తహసీల్దార్ బి.విజయ..సీఐ రవి కుమార్.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
- మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో శనివారం నుండి ఎడతెరిపి లేకుండా వచ్చిన వర్షాలతో మండలంలోని చాలా గ్రామాల్లో రైతుల పంట పొలాలు నీట మునిగాయి.అదే విధంగా సుద్ద రేవు గ్రామం వద్ద ఆదివారం బయ్యారం పెద్ద చెరువులోకి ప్రవహించే పంది పంపుల వాగు,మసి వాగు,కొంగర వాగు లో వరద నీరు ఉదృతికి సుద్దరేవు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కంబాలపల్లి నారాయణపురం,రామచంద్రాపురం ,మిర్యాలపెంట,లక్ష్మీ పురం గ్రామప్రజల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.అదే విదంగా బయ్యారం నుండి మొట్లతిమ్మాపురం గ్రామం మద్యలో వట్టేరు వాగు ఉదృతంగా వరద నీరు రావడంతో ఆ గ్రామానికి రాక పోకలు నిలిచి పోయాయి.అదే విదంగా గౌరారం నుండి మహబూబాబాద్ వెళ్లే మార్గ మధ్యలో గౌరారం కట్టు కింద లోలెవల్ బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహించడంతో ఆ గ్రామ ప్రజలు బాలాజీపేట మీదుగా ఉప్పలపాడు రోడ్డు నుండి చుట్టు తిరిగి జిల్లా కేంద్రానికి పోవల్సి వచ్చిందని తెలిపారు.అదేవిధంగా అల్లిగూడెం కంబాలపల్లి మధ్యలో పంది పంది పంపుల వాగు ఉదృతంగా ప్రవహించడంతో పందిపంపుల గ్రామం,కంబాలపల్లి ,రెడ్యాతండా గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి.తుఫాన్ ప్రభావం వల్ల అధికారుల ముందస్తూ హేచ్చరికలతో బయ్యారం పోలీసులు,రెవిన్యూ అధికారులు స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని వరద ఉదృతి ఉన్న వాగుల వద్ద,వాహన రాక పోకలు ఇబ్బందులు లేకుండా కట్టడి చేశారు.ఈ వరద ప్రభావం ఎక్కువ గా ఉన్నా గ్రామాల్లో బయ్యారం మండల రెవిన్యూ సిబ్బందితో కలిసి తహసీల్దార్ బి.విజయ,పోలీస్ సిబ్బందితో సిఐ రవికుమార్,ఎస్ఐ తిరుపతి మండలంలో వరద ప్రభావం ఉన్న అన్నీ గ్రామాల్లో పర్యటించారు.