ఉత్తమ పద్మశాలీ ఉద్యోగులకు పెద్దపల్లి జిల్లా టీపీయుఎస్ సన్మానం

భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉత్తమ ఉద్యోగ పురస్కారాలు/ప్రశంస పత్రాలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ, పబ్లిక్ సెక్టార్ సంస్థలు (సింగరేణి/ఎన్టీపీసి/కేశోరామ్/ఆర్టీసి తదీతర సంస్థలు) పద్మశాలి ఉద్యోగులను పెద్దపల్లి తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం (టి పి యు ఎస్) తరఫున సన్మానం చేస్తున్నట్లు టి పి యు ఎస్  పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక సారయ్య, పరికిపండ్ల కోటేశం తెలిపారు. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపబడిన పద్మశాలీల వివరాలు 31-08-24 శనివారం రోజు లోపు 9014350145, 9948408904 నంబర్లకు తెలుపగలరని ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపబడిన పద్మశాలీలైన బొద్దుల గంగయ్య,ఆర్డీవో, పెద్దపల్లి, అడిచెర్ల శ్రీనివాస్, ఏడీఈ(ఆపరేషన్స్)జిడికే, పెద్దపల్లి సర్కిల్, దాసరి రాజ్ కుమార్, డిఈఈ, మిషన్ భగీరథ మంథని, గుడెల్లి మహేశ్వర్, డీజీయం, టర్బైన్ మెకానికల్ మేంటనేన్స్, యన్టీపీసీ, గౌడ ఆంజనేయులు, ఏఈ, డిపిఆర్ఈ కార్యాలయం, పెద్దపల్లి, ఆడెపు శారద , ఏఎస్సై, రామగుండం ఏసిపి కార్యాలయం, కొలిపాక నగేష్, సబ్ ఇంజనీర్, రామగుండం యన్టీపీసీ, తొడ్డు రాజహరి, మెకానికల్ ఫోర్మెన్, సింగరేణి ఆర్జీ3ఓసి1, గుడెల్లి కనకయ్య, ఈపీ హెల్పర్, సింగరేణి ఆర్జీ3 ఓసి2, గుడెల్లి శంకరయ్య, అసిస్టెంట్, ఎలక్ట్రికల్ విభాగం, యన్టీపీసీ, వివరాలందాయని వారిని అభినందింస్తూ, ఇంకా ఏవరైన ఉంటే వారి వివరాలను తెలియజేయాలని పత్రికాముఖంగా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment