రామగుండం-3, ఏరియాలోని వివిధ గనులు, విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ల ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కాంట్రాక్టర్లందరూ తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులచే హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకులో వేతన ఖాతాలు తెరిపించి, ఆ ఉద్యోగుల నెలసరి వేతనాలు ఆ ఖాతాలలో జమ చేయాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు కోరారు. శుక్రవారం నాడు జి.యం. కార్యాలయంలో సంబంధిత కాంట్రాక్టర్లు, విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ల ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ప్రత్యేక కృషితో ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని, కావున సంబంధిత ఉద్యోగులకు ప్రమాద బీమాపై అవగాహన కల్పించి, వారితో వేతన ఖాతాలు తెరిపించాలని అన్నారు. సమావేశంలో పాల్గొన్న వివిధ కాంట్రాక్టర్లు లేవనెత్తిన సమస్యలను ఆ బ్యాంకు ప్రతినిధి రాజు దేవరాయ దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లు వారి కరెంటు అకౌంట్లు, ఉద్యోగుల వేతన ఖాతాలు సులభతర పద్ధతిలో తెరిపించేలా హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు సిబ్బంది సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో ఫైనాన్స్ విభాగాధిపతి పి.శ్రీనివాసులు, ఏరియా ఇంజనీర్ వై.విజయశేఖరబాబు, ఎస్వోటుజియం జి.రఘుపతి, ప్రాజెక్ట్ అధికారులు వెంకటరమణ,రాజశేఖర్, విభాగాధిపతులు రాజేంద్రకుమార్, కాశీవిశ్వేశ్వరరావు, సుదర్శనం, శర్వణన్, ధూప్ సింగ్, అధికారులు రాజేంద్రప్రసాద్, గుర్రం శ్రీహరి, సునీల్ ప్రసాద్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద భీమా వర్తింపు కోసం హెచ్.డి.ఎఫ్.సి. వేతన ఖాతాలు తెరిపించండి
Updated On: November 22, 2024 7:45 pm