విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి 

 

 

విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలని 44వ వార్డు గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 44వ వార్డులో అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులుగా గణనాథునికి కి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం గణపతి విగ్రహం వద్ద దేశ గాని శ్రీనివాస్ గౌడ్ దంపతులు , యామ సుధాకర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వినాయకుని ఆశీస్సులతో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలగాలని నిమజ్జనం రోజు ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment