మంథని జెఎన్టీయు లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని జెఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఇండోర్ ఆటలైన షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్ పోటీలను జరిపారు. గెలుపొందిన విద్యార్థులకు గురువారం జరిగిన కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి  రమేష్, జగిత్యాల జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, మంథని కళాశాలల ప్రిన్స్ పాల్ చెరుకు శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. షటిల్ పోటీల్లో వంశీ, సహస్రకు ప్రథమ బహుమతి,అభిరామ్, వశిష్టకు ద్వితీయ క్యారమ్స్ లో రోహిత్,  యశస్వీతకు ప్రథమ,గౌతమ్, వర్షితకు ద్వితీయ, చెస్ పోటీల్లో అభిరామ్, శ్రావణికి ప్రథమ  శ్రీనివాస్, నిఖితకు ద్వితీయ బహుమతులు దక్కాయి. కార్యక్రమంలో డిఇఇ సతీష్ ఆఫీసు సూపరింటెండ్ రవికుమార్, లైబ్రరీ ఇంచార్జి రమణ, కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు పింగిళి కృష్ణారెడ్డి, సునీల్ తదితరులు పాల్గోన్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment