బయ్యారం మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడు మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో శాంతి, సామరస్యం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిఢవిల్లాలని, విఘ్నాలను ప్రారద్రోలే ఆ వినాయకుడు వీటికి భంగం కలిగించే విచ్ఛిన్నకర శక్తులను ఈ దేశం నుంచి పారద్రోలాలని ప్రజలు వేడుకోవాలని కోరారు.
తొమ్మిది రోజులపాటు నిర్వహించే గణనాథుడి ఉత్సవాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని శాంతి, సామరస్యతను పెంపొందించాలన్నారు. అందరికీ మంచి జరగాలని ఆ గణనాథుణ్ని కోరుకుందామన్నారు.