విధుల్లో చురుకుతనం చూపించాలి అని కమాన్ పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ అన్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని ఆదివారం రోజున కమాన్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లు ముత్తె ప్రకాష్, కందుకూరి వంశీకృష్ణ ,జొన్న రాజేష్ కుమార్, నర్మెటి వినోద్, కల్లేపల్లి శ్రీనాథ్, షేర్ల సరిత, బంగారు సంగీత, ఎలుకపల్లి జాహ్నవి లు ఎస్సై కొట్టే ప్రసాద్ కు విధుల్లో జాయినింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై అధికారుల సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలని అన్నారు. క్రైమ్ జరిగిన చోట తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై కలుపుగోలుగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాలని అన్నారు. వీటితోపాటు ఏఎస్ఐ ఖలీల్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ బాపన్న తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో చురుకుతనం చూపించాలి
Published On: December 2, 2024 6:49 am