ముదిరెడ్డి అనసూర్యమ్మ మరణం సీపీఎం పార్టీకి తీరని లోటు

 

నమ్మిన సిద్ధాంతం కోసం తన వృద్ధి శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ ముదిరెడ్డి అనసూయమ్మ మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు.ఈరోజు మునగాల మండలం నర్సింలగూడెం గ్రామంలో జరిగిన ముదిరెడ్డి అనసూర్యమ్మ గారి దశదిన కార్యక్రమం సందర్భంగా ఆయన హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనరసింహులగూడెం గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన దాంట్లో అనసూయమ్మ కుటుంబం చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. గ్రామంలో అరాచక కాంగ్రెస్ పార్టీ దాడులను దౌర్జన్యాలను ఎదుర్కొంటూ పార్టీ ఎదుగుదల కోసం అనసూయమ్మ కృషి చేశారని అన్నారు. తన ఇద్దరు కుమారులు కామ్రేడ్ ముదిరెడ్డి ఆదిరెడ్డి ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి దారుణ హత్యకు గురైన బెదరకుండా ధైర్యంతో నిలబడి కమ్యూనిస్టు పార్టీని నిలబెట్టి కార్యకర్తలను కాపాడటంలో అనసూర్యమ్మ కీలకపాత్ర పోషించారని అన్నారు. నేటికీ అనసూయమ్మ గారు చూపిన బాటలో వారి మిగతా కుటుంబ సభ్యులకు కూడా అదే ఎర్రజెండా నీడలో పనిచేయడం అభినందనీయమని అన్నారు. రాజకీయాలు వేగంగా మారుతూ కుటుంబ సభ్యుల్లో వేరువేరు పార్టీలో పని చేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా సిపిఎం పార్టీ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసంతో పార్టీ కోసం కుటుంబ సభ్యులు పనిచేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనసూయమ్మ భౌతికంగా దూరమైన వారి ఆశయాల సాధన కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అనసూర్యమ్మ మరణం పట్ల వారి కుటుంబానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ* మునగాల పరగణాలు కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న నర్సింహులగూడెం గ్రామంలో పార్టీ కార్యకర్తలను కాపాడటంలో తన భర్త రంగారెడ్డి అడుగుజాడల్లో పనిచేయడం లో అనసూయమ్మ ముందు భాగంలో ఉందన్నారు. అనేకమంది కార్యకర్తలపై ప్రత్యర్థి పార్టీల నాయకులు దాడులు దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు బనాయించిన వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొన్న దీశాలి అనసూయమ్మని తెలిపారు. గ్రామంలో జరిగిన అనేక ప్రజా పోరాటాలలో సిపిఎం పార్టీ కార్యక్రమాలలో అనసూర్యమ్మ పాత్ర మరువలేనిదని వారి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కోట గోపి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, పల్లె వెంకటరెడ్డి,వట్టెపు సైదులు,మిట్టగడుపుల ముత్యాలు సిపిఎం మండల కార్యదర్శి చందా చంద్రయ్య సిపిఎం అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ గ్రామ మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి మాజీ ఎంపీటీసీ జూలకంటి విజయలక్ష్మి,నాయకులు పొశనబొయిన హూస్సన్,శీలం శ్రీను,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూరి స్వరాజ్యం షేక్ సైదా స్టాలిన్ రెడ్డి తుమ్మల సతీష్ శాఖా కార్యదర్శి మారం వెంకటరెడ్డి మండల నాయకులు వెంకటరెడ్డి శాఖ నాయకులు ఉదయమ్మ, అబ్రహం,వెంకన్న,అచ్చయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment