సుందిళ్లలో తల్లి పాల వారోత్సవాలు

రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలో తల్లిపాల వారత్సవాలు నిర్వహించడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు, తల్లికి మొదటగా వచ్చే మురుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఇవ్వాలనీ అనుబంధ ఆహారం ఇస్తూ తల్లిపాలను రెండు సంవత్సరముల వరకు కొనసాగించాలని వివరించడం జరిగింది. పిల్లల పెరుగుదలపై ప్రత్యేక శుద్ధ వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరు నెలల నుండి బాబుకు అన్న ప్రసన్న కార్యక్రమం,  గర్భిణీల బరువులు, ఎత్తులు చూడడం జరిగింది.   పిల్లల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పల్లె అనిత, హెల్త్ సూపర్వైజర్ సీతారామయ్య, ఏఎన్ఎంలు శోభరాజ్, స్వరూప, ఆశా వర్కర్లు లక్ష్మీ, రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్స్ తిరుపతమ్మ, విజయ,చంద్రకళ, అను, వసంత తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment