నిరుపేదలకు అండగా ఇల్లందు ఎమ్మేల్యే కోరం కనకయ్య.
బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సోసైటీ చైర్మన్ మూల మధూకర్ రెడ్డి.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండలంలోని గౌరారం గ్రామపంచాయితీ పరిధిలో గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గౌరారం , కోడిపుంజులతండలో తుఫాను దాటికి ఇండ్లు కూలడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు ఎంఎల్ఏ కోరం కనకయ్య వారి ఆదేశాల మేరకు బయ్యారం రైతు సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బియ్యం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.అలాగే ఎంఎల్ఏ గారితో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాందాటి శ్రీనివాస్,తాడబోయిన ప్రభాకర్ యాదవ్, వట్టం సాంభశివరావు, శ్రీపతి ఉపేందర్, కోడి బుచ్చయ్య,కేశోజు నవీన్, అఖిల్ , కొడిపుంజులతండ, గౌరారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.