రైతులకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చి బాబు,రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర రావు ఆధ్వర్యంలో తెలంగాణ  ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు సుందిళ్ల గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చిబాబు,పేరాల మహేశ్వర రావు మాట్లాడుతూ  సర్వేనెంబర్ 390 లో ఉన్న రైతులు భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఎలాంటి నష్టపరిహారం అందక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అనేక విధాలుగా సర్వేనెంబర్ 390 లో గల రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని పలు దఫాలుగా ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబును రైతులు వేడుకోగా వాళ్ల బాధల్ని అర్థం చేసుకున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి సర్వే నంబర్ 390 కి సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించలేక పొగ పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.ఒకరి భూమిలో మరొకరికి భూమి రాసి గొడవలు సృష్టించిందని అలాగే రైతుకు ఉన్న భూమిని కుదిస్తూ స్థానికేతరులకు రాసుకున్నారని అన్నారు.ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీలకు కట్టుబడి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్,ఐదు వందల రూపాయల కే గ్యాస్ సిలిండర్,తాజాగా రైతును అప్పుల ఉబిల్లోనుండి కాపాడుతూ మొదటి దఫా లక్ష్య రూపాయలు,రెండో దఫా లక్షన్నర రూపాయల రుణ మాఫీ చేస్తూ ఏ రాష్ట్రం చేయని సాహసం చేసి రైతుల పక్షాన నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని తాజాగా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగ కల్పనే ద్యేయంగా జాబ్ క్యాలండర్ విడుదల చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సుందిల్ల గ్రామ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment