రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. స్వామి వారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలిప్రజలు సుఖ శాంతులతో ఉండాలి అని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో రైతులు పాడి పంటలతో తులతూగాలని కోరుకోవడం జరిగిందని మంత్రి అన్నారు.అనంతరం శ్రీ విఖనస సుధర్మా సేవా సమితి ఆధ్వర్యములో సర్వకామప్రద సుదర్శన సహిత లక్ష్మి నృసింహ యాగ వైభవము కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు
Published On: November 27, 2024 2:55 pm