తొగర్రాయి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్: డి ఎం హెచ్ ఓ

తొగర్రాయి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్: డి ఎం హెచ్ ఓల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సూర్యాపేట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తొగర్రాయి గ్రామం జలమయమైనది. అక్కడి పరిస్థితులు పరిశీలించుటకు డాక్టర్ కోటాచలం గ్రామాన్ని సందర్శించి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు మరియు కలుషితమైన నీటి ద్వారా, దోమల ద్వారా, ఈగల ద్వారా వచ్చే వ్యాపించే అంటూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగినది. 

• కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి, 

• క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తీసుకోవాలి. 

• అక్కడ గ్రామపంచాయతీ సిబ్బందికి త్రాగునీటిని తప్పకుండా క్లోరినేట్ చేయవలసిందిగా సూచించారు.

• ముందస్తు చర్యగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. 

• అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది.

 కూచిపూడి గ్రామాన్ని కూడా సందర్శించి ప్రజలకు మరియు పరిసరాల పరిశుభ్రత పైన తగిన సలహాలు ఇవ్వడం జరిగింది ఆరోగ్య సిబ్బందికి ముందస్తు చర్యగా మెడికల్ క్యాంపు నిర్వహించిన క్యాంప్ సందర్శించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment