మందకృష్ణ పోరాటమే ఎస్సీ వర్గీకరణ ఫలితం

మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ విజయమని కమాన్ పూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్రలకు అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమించిన ఎం. ఆర్. పీ. ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి శుక్రవారం ఎం. ఆర్. పి. ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. లక్ష్య సాధన కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ లక్ష్యాన్ని సాధించిన మందకృష్ణ మాదిగ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. ఆర్. పి. ఎస్, వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు కుక్క రవీందర్,చిప్పకుర్తి సత్యనారాయణ, మల్యాల తిరుపతి, నక్క శంకర్, మల్లారపు అరుణ్ కుమార్, కుక్క చంద్రమౌళి, గడప కృష్ణమూర్తి, మచ్చగిరి రాము, పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, పిల్లి చంద్రశేఖర్, అనవేన లక్ష్మీరాజం, నగునూరి నర్సయ్య గౌడ్, జంగపెల్లి పెద్ద శ్రీనివాస్, చిప్పకుర్తి శ్రీనివాస్, శివలింగం, ఆరేపెల్లి పీరయ్య, కుక్క ఈశ్వర్, చిప్పకుర్తి అరుణ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment