సెమ్స్ ఒలింపియాడ్ లో రాష్ర్ట స్థాయి ర్యాంకులు సాధించిన కృష్ణవేణి విద్యార్థులు 

సెమ్స్ ఒలింపియాడ్ లో రాష్ర్ట స్థాయి ర్యాంకులు సాధించిన కృష్ణవేణి విద్యార్థులు 

సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరం విద్యార్థిని, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా పిల్లలకి ఒలింపియాడ్ పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. గత సంవత్సరం 2023-24లో జరిగిన సెమ్స్ ఒలింపియాడ్ పరీక్షల ఫలితాలు ఆగష్టు నెల చివరివారంలో విడుదల చేశారు. ఇట్టి ఫలితాలలో కృష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి లో 1,2,3,8 ర్యాంకులు సాధించిన పులి రేవర్షిణి, కొలిపాక కృష్ణ మనోహర్, ఆకుల రితిక, మిట్ట సాయి వర్శిత లు సాధించారు. వీరితో పాటు 12 మంది విద్యార్థులు జోనల్ లెవల్ ర్యాంకులు సాధించారు. ఇట్టి విద్యార్థిని, విద్యార్థులను సెమ్స్ ఒలింపియాడ్ కన్వీనర్  అరకాల రామ చంద్రారెడ్డి , పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి , ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్, టీ ఆర్ ఎస్ ఎం ఏ  అధ్యక్షులు సమ్మారావు మరియు డైరెక్టర్స్ శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి లు ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమము లో ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment