రామగిరి మండలం పన్నూరు గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా శ్రీకృష్ణుని పటానికి పూలమాలవేసి కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు కృష్ణ-గోపిక వేషధారణలో ఆట-పాటలతో అలరించారు. మరియు చిన్ని కృష్ణ-గోపిక వేషధారణలో డ్యాన్స్ లు, ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి గెలుపొందిన పిల్లలకు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకులు ఆచార్య గోవర్ధనగిరి ధీరజ్ కృష్ణ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పన్నూర్ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు
Published On: August 27, 2024 9:15 pm