కృష్ణవేణి లో కృష్ణాష్టమి వేడుకలు

రామగిరి మండలం కల్వచర్ల  గ్రామం లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆద్వర్యంలో  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను సాయిబాబా గుడి ఆవరణలో గల శ్రీ రామ-సాయి కళ్యాణ మండపం నందు  అంగ రంగ  వైభవంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కృష్ణ-గోపిక వేషధారణలో ఆట-పాటలతో అలరించారు. మరియు చిన్ని కృష్ణ-గోపిక వేషధారణలో డ్యాన్స్ లు, ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి,  ప్రిన్సిపాల్ బర్ల శ్రీనివాస్, డైరెక్టర్స్ శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి,రంజిత్ రెడ్డి, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment