కమాన్ పూర్ లో కృష్ణాష్టమి వేడుకలు 

 

కమాన్పూర్ మండల కేంద్రంలో గల ఆపిల్ కిడ్స్ పాఠశాల ఆవరణలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరపడం జరిగింది.ఈ వేడుకలకు శ్రీకృష్ణ గోపికవేషధారణలో విద్యార్థి విద్యార్థులు రావడం జరిగింది. శ్రీకృష్ణుని జన్మదినం పురస్కరించుకొని ముందుగా శ్రీకృష్ణుని పటానికి పూలమాలవేసి కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్నటువంటి విద్యార్థుల చేత ఉట్టి కొట్టించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా విద్యార్థులు ఉట్టి కొట్టి ఎంతో సంతోషం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ చదువు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మన యొక్క సాంస్కృతిని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలను పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా బాల్యంలో విద్యార్థులు తప్పనిసరిగా ఆటపాటలతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని వారు చిన్నారులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజమణి,భూలక్ష్మి, గౌతమి, రజిత,జేబా, పౌజియ అధిక సంఖ్యలో పోషకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment