నవంబర్ నెల 25వ తేదీన హైదరాబాదులో నిర్వహించబోయే తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరపాత్రాలను ఆవిష్కరించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పడిందని గుర్తు చేశారు వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు యూనియన్లకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి నాగబాబు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ రాము, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్,నియోజకవర్గ అధ్యక్షులు అల్వాల రవి, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు చిలక సైదులు, నియోజకవర్గ కోశాధికారి మాలోతు శంకర్ నాయక్,నియోజకవర్గ ఉపాధ్యక్షులు పల్లె సుధాకర్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి రాము,కమిటీ సభ్యులు మన్నేం రాంరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ జెఏ మహాసభను జయప్రదం చేయాలి: కందుకూరి యాదగిరి
Published On: September 17, 2024 8:06 pm