కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య.

కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య.

బయ్యారం:చార్మినార్ ఎక్స్ ప్రెస్.

బయ్యారం మండల కేంద్రంలో స్టానిక ఎంపీడీఓ కార్యాలయంలో 61 కల్యాణ లక్ష్మి, 30 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య చేతుల మీదగా అందించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి పాఠశాలకు ప్రహరీ గోడ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

 బయ్యారం గ్రామంలో ఇటీవలే మరణించిన ట్రాక్టర్ డ్రైవర్ మొగిలిచర్ల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి కృష్ణ చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అజ్మీరా భవాని, చిర్ర సాంబయ్య కుటుంబ సభ్యులను మరియు అనారోగ్య బారిన పడిన బానోత్ లక్ష్మా లను తీగల వెంకటయ్య ను పరామర్శించారు. బయ్యారం పెద్దచెరువు తూముల వద్ద ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రతేక పూజలు నిర్వహించి నీటిని ఈ రోజు విడుదల చేశారు. అనంతరం వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నందున మండలంలో దిగువస్థాయి పొలాలకు నీరందే విధంగా నీటిని విడుదల చేయాలని పారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. కోటగడ్డ గ్రామం నుండి కొత్తపేట వస్తున్న మార్గమధ్యలో ఉన్న ప్రధాన పంట కాలువలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఈ కాలువ నుండి పంటలకు నీరు విడుదల చేసే సమయం ఆసన్న మైందని త్వరగా పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం గంధంపల్లి లో జరిగిన కొల్లిపాక సురేష్ గారి కుమార్తె ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య, డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్ రెడ్డి,జిల్లా పార్టీ కార్యదర్శి భూక్యా ప్రవీణ్ నాయక్,మాజీ ఎంపీటీసీ సనప సోమేష్, మోహన్, మాజీ సర్పంచ్ పోలేబోయిన వెంకటేశ్వర్లు బాబా నాయకులు నాయిని శ్రీనివాస్ రెడ్డి,రాసమళ్ళ నాగేశ్వరావు,తమ్మిశెట్టి వెంకటపతి,చల్లా సురేష్, మంగీలాల్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment