ప్రజల అభిరుచి మేరకు అరేబియన్ రుచులతో కబ్సా మండి

 

సూర్యాపేట పట్టణ ప్రజలకు అరేబియన్ రుచులను అదించేందుకు కబ్సా అరేబియన్ మండిని పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్మాల్ పక్కన నిర్వాహకులు ముఫ్తీ ఇస్రార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్సా అంటే చికెన్తో తయారు చేసేదని మండి అంటే మటన్తో తయారు చేసేదని సూర్యాపేటలో ఇలాంటి సౌదీ అరేబియన్ రుచులను ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేయబడిన రెస్టారెంట్ కబ్సా అరేబియన్ మండి అన్నారు. కబ్సా మండిలకు ఉపయోగించే మసాలాలు, పొయ్యిలు వేరు వేరుగా ఉంటాయని 15 సంవత్సరాల అనుభవం కలిగిన మాస్టర్ చెప్స్ చే ఈ వంటలు చేయించడం జరుగుతుందన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక పోవడంతో ఈ రంగాన్ని ఎంచుకొని నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కబ్సా మండి రెస్టారెంట్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఇమామ్ మజ్జీద్ ఏ ముఫ్తీ ఉస్సాయా, అబ్దుస్ సలీమ్, అబ్దుల్లా, లతీఫ్ భాయ్, అయుభ్బాయ్, జహంగీర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment