రామగుండం-3 ఏరియాలోని వివిధ గనులు, విభాగాలలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన, మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించిన 10 మందికి కారుణ్య నియామక ఉద్యోగాల ఉత్తర్వులను సోమవారం జి.ఎం. కార్యాలయంనందు నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జీ-3 జీ.ఎం ఎన్.సుధాకర రావు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ ఉద్యోగంలో చేరుతున్నారని, అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పని చేస్తూ, అధికారులు, సూపర్ వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, భద్రతతో విధులు నిర్వహించాలని కోరారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఒక వరం లాంటిదని, చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని, సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకొని, కలిసి కట్టుగా పనిచేసి మున్ముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబం తో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులు వై.వి.రావు, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి జి.శ్రీనివాస్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డివైపిఎం వి.సునీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.