సెంటినరీ కాలనీలో వాహనాల తనిఖీ

పెద్దపల్లి- మంథని ప్రధాన రహదారి రామగిరి మండలం  సెంటినరీ కాలనీ వద్ద రామగిరి పోలీసులు ఎస్సై కే సందీప్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాలను శనివారం  తనిఖీ చేశారు. ఆ దారి గుండా వచ్చే వాహనాలను వాహనాల డాక్యుమెంట్స్ మరియు లైసెన్స్ హెల్మెట్ తదితర వాటిని తనిఖీ చేశారు. అలాగే ప్రతి వాహనదారు లైసెన్స్ కలిగి ఉండాలని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని ఎస్సై సందీప్ అన్నారు. గతంలో ఉన్న చలాన్లు వెంటనే కట్టాలని ఎస్సై అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ రాంబాబు మరియు లఖన్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment