ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్ లు

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ని బేగంపేట్ ఎక్స్ రోడ్ లో మంథని-పెద్దపల్లి రహదారి ప్రక్కన  సర్వే నెంబర్ 65/c/3/1/1 మరియు 65/c/3/1/2 గల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి డిటిసిపి అనుమతులు గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా విక్రయించుటకు ప్రయత్నిస్తున్నారు.ఇట్టి సర్వే నెంబర్ గల భూమిని డిటిసిపి  అనుమతులు తీసుకున్న తర్వాతనే ఫ్లాట్లుగా చేసి విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని రత్నపూర్ గ్రామానికి చెందిన రామగిరి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోచం ఆరోపించారు. పలుమార్లు మండల అధికారులకు జిల్లా అధికారులకు పిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment