హైడ్రా వ్యవస్థను అన్ని జిల్లాలకు,పట్టణాలకు,మండలాలకు విస్తరింపజేయాలి.

హైడ్రా వ్యవస్థను అన్ని జిల్లాలకు,పట్టణాలకు,మండలాలకు విస్తరింపజేయాలి.

-బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

విజయవంతం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలుస్తారు.చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి.

చెరువులు,కుంటల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడం శుభ పరిణామము ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదములు పూర్తి మద్దతు తెలుపుతున్నా.ఈ వ్యవస్థను జిల్లాలోని అన్ని పట్టణ కేంద్రాలకు, మండలాలకు,విస్తరింపచేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న . నగరాల అస్తవ్యస్త నిర్మాణంతో చెరువులు, నాళాలలో వెలసిన అక్రమ నిర్మాణాల వల్ల నగర పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా వరదలు వంటి పెను విపత్తులకు కారణమవుతుంధి రాష్ట్రంలో చాలాచోట్ల చెరువులు, కుంటలు, నాళాలు అక్రమణలకు గురయ్యాయి.ఈ అక్రమణలకు అడ్డుకట్ట వేయాలంటే హైడ్రా లాంటి స్వతంత్ర వ్యవస్థ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు విస్తరింపజేయాలి చట్ట వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చిన అధికారులను వాటి వెనుక ఉన్న రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి, చెరువులను కాపాడాలి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంకల్పం చాలా గొప్పధి విజయవంతం అయితే చరిత్రలో నిలిచి పోతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment