ఘనంగా తెలుగు వ్యవహారిక భాష దినోత్సవం

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథని లో ఎన్ ఎస్ ఎస్ మరియు తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పరిషయ్యా  మాట్లాడుతూ గ్రాంథిక భాష అర్థమయ్యే విధంగా ఉండేది కాదని అందరికీ అర్థమయ్యే విధంగా వ్యావహారిక భాష ఉంటుందని ఈ భాషకు ప్రాణం పోసిన వ్యక్తిగా గిడుగు రామ్మూర్తి పంతులు ని పేర్కొంటామని తెలియజేశారు.తెలుగు విభాగం అధ్యాపకులుమానస  మాట్లాడుతూ తెలుగు భాషను వ్యావహారిక భాష గా రూపొందించడంలో గిడుగు రామ్మూర్తి పంతులు సేవలు వెలకట్టలేనివని తెలియజేశారు.తదుపరి ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐక్యుఏసి కో ఆర్డినేటర్ కృష్ణ,ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డా.లక్ష్మీనారాయణ అధ్యాపకులు అమర్నాథ్,ముకుందం,బోధనేతర సిబ్బంది అశోక్,శ్రీనివాస్,సుధాకర్, ముజాహిద్,దుర్గరాజ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment