రామగిరి మండలం సెంటనరీ కాలనీ లో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతి రావు పూలే వర్దంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపు మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే ఆశయ సాధనకు ఉద్యమిద్దాం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు.సమాజంలో అణగారిన వారి అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహత్మ జ్యోతి రావు పూలే అని అన్నారు.వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఐన్టీయూసీ రామగుండం ఆర్జీ-3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి,రామగిరి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కండే పోశం,రామగిరి మండల ప్రచార కన్వీనర్ ముస్త్యాల శ్రీనివాస్, తాజా మాజీ ఎంపీటీసీ కొప్పుల గణపతి, ఐన్టీయూసీ నాయకులు సందేల కుమార్, వెంకటేష్,పీవీ గౌడ్, శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మైధం వరప్రసాద్, ఇర్ల రాజయ్య, గ్యాస్ రవీందర్ రెడ్డి,ఒర్రే సది,గాజుల భూమయ్య గౌడ్,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే వర్దంతి
Published On: November 28, 2024 2:06 pm