చేయూత పథకం పోలీస్ కుటుంబాలకు అండ

పోలీస్ శాఖలో సిబ్బంది కోసం అమలు చేస్తున్న చేయూత పథకం వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని జిల్లా యస్.పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అన్నారు. సూర్యపేట జిల్లా పోలీసు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస రెడ్డి అనారోగ్యంతో ఆకాలంగా మృతిచెందారు. పోలీసు కుటుంబ సంక్షేమంలో భాగంగా శ్రీనివాస్ రెడ్డి కుటుంభ సభ్యులకు కు రెండు లక్షల రూపాయల చెక్కును చేయూత పథకం ద్వారా జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పీ అందచేశారు. ఈ చేయూత పథకానికి ప్రతి నెల విరాళాలు అందిస్తున్న జిల్లా సిబ్బందిని అభినందిస్తున్నాము అని తెలిపినారు.కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ గౌడ్, ఏవో మంజు భార్గవి, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, ఆర్ ఎస్ ఐ సాయిరాం ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment