చివ్వెంల మండలం ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్యపాద్ మంత్ర స్వరూప్ దాస్ స్వామీజీ,ప్రిన్సిపాల్ సిహెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించేవాడని విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ, మాతృభాష మాధుర్యాన్ని చవిచూపిస్తూ, తెలుగులోని వెలుగును అందిస్తూ, పిల్లల సేవలో నా జీవితం ధన్యమని భావిస్తూ తల్లిలా లాలిస్తూ, తండ్రిలా రక్షిస్తూ, మిత్రుల చేరదీసి ఆప్తునిలా ఆదరించే వారే ఉపాధ్యాయులని తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను శాలువాలు,బహుమతులతో సత్కరించడం జరిగింది.