గణేష్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలి:-సీఐ రవి కుమార్.

గణేష్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలి.

-గార్ల-బయ్యారం సీఐ రవి కుమార్.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

గార్ల బయ్యారం మండల పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులు,అన్యమతాలతో పాటు బీజేపీ, విశ్వహిందూ పరిషత్,వారితో శనివారం సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సీఐ రవి కుమార్ మాట్లాడుతూ మండపం నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని, దరఖాస్తు చేసుకున్న అనంతరం పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.గణేష్ మండపాల నిర్వాహకులు వారి కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులలోను డిజేలను ఏర్పాటు చేయరాదు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే స్థానిక పోలీసులకు సమాచారం అందించలని అన్నారు ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్ఐ తిరుపతి,గార్ల ఎస్ఐ జినత్ కుమార్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment