మానవత్వం చాటుకున్న గద్వాల ఉదయ్ బ్రదర్స
ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడు చికిత్స కోసం ఆర్థిక సహాయం
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీకాంత్ కుమారుడు అనారోగ్య సమస్యతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్న గద్వాల ఉదయ్. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించలేని స్థితిలో ఉన్న పరిస్థితి స్థానికంగా గ్రామ వాట్సాప్ గ్రూప్ లలో ఎవరైనా సహాయం చేయాలని కోరారు. అదే గ్రామానికి చెందిన గద్వాల రంగయ్య చిన్న కుమారుడు గద్వాల ఉదయ్ అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నాడు బాలుడి పరిస్థితి చూసి చలించి పోయిన ఉదయ్ మానవతా హృదయంతో ఆన్లైన్ ద్వారా ఆ కుటుంబానికి 10000/- రూపాయలు గద్వాల ఉపేందర్ చేతుల మీదగా ఆర్థిక సాయం అందించారు అమెరికాలో ఉంటూ కూడా సొంత ఊరి ప్రజలకు ఆపద వచ్చిందంటే ముందుకొచ్చిన గద్వాల ఉదయ్ కి గ్రామ ప్రజలు యువకులు కృతజ్ఞతలు తెలియజేశారు.