సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి యువ బలగం రామగుండం రీజియన్ వారి ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి మైదానం నందు ఉదయం 7గంటలకు ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య చే దాదాపు వంద మందికి ఉచితంగా షుగర్ పరీక్షలు చేసి వారికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్జీ3 ఏరియా ఎస్ ఓ టు జిఎం రఘుపతి మాట్లాడుతూ సింగరేణి లో పనిచేసే యువ కార్మికులు అటు రక్షణ కూడిన ఉత్పత్తి లో కృషి చేయడంతో పాటు, సామాజిక బాధ్యతగా కార్మికులు అంత ఒక బృందంగా ఏర్పడి ప్రతి నెల ఒక వంద రూపాయలు జామచేస్తూ వచ్చిన మొత్తమును సేవ కార్యక్రమాలకు ఉపయోగించడం చాలా సంతోషకరమైన విషయము అని, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ శరణ్య ని అభినందిస్తూ, సింగరేణి యువ బలగం టీం సభ్యులు గతంలో నిరుపేద కుటుంబానికి నిత్యవసరవస్తువులు, ఒక కాంట్రాక్టు కార్మికుడికి వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం చేయడం, అలాగే ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోతే వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఇలాంటి మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో ఈ యొక్క బృందం సంఖ్య పెరిగి ఇంకా ఉన్నతమైన సేవ కార్యక్రమాలు చేయాలని సింగరేణి యువ బలగం టీం సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఈ యెుక్క బృందానికి మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బెల్లం శ్రీనివాస్,సురేష్,సంతోష్, శేషీ కుమార్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షలు
Published On: December 23, 2024 6:10 pm