రైతులు ఆందోళన చెందవద్దు

అర్హులైన రైతులందరికి రుణమాఫీ వర్తిస్తుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి అన్నారు. 

కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎస్. బీ. ఐ బ్యాంక్ లో మేనేజర్, వెంకటేశ్వర్ రావు ఫీల్డ్ ఆఫీసర్ వి. రాజేశం లతో రుణమాఫీయైన రైతులకు తిరిగి రుణాలను త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనంతరం బ్యాంక్కు వచ్చిన రైతులు రుణమాఫీ పై పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని నివృత్తి చేశారు. ఇంకా ఎవరికైనా రుణమాఫీ పై సందేహాలు ఉంటే రైతు వేదికల్లో ఏ. ఈ. వో లను లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. రుణమాఫీ కానీ రైతులు బ్యాంక్ల చుట్టూ తిరగవద్దని,  వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లాలని సూచించారు. అర్హులైన ప్రతివారికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని కొన్ని అనివార్య కారణాలవల్ల కొందరి పేర్లు రాలేదని అన్నారు.ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి బండి. ప్రమోద్ కుమార్ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment