- వృధాగా పోతున్న రాయికుంటలో నీరు.::ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.
చార్మినార్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 9 కొల్చారం మండలం ప్రతినిధి శ్రీశైలం
మెదక్ జిల్లా కొల్చారం మండలం
సీతారామ్ తండా లో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రాయికుంట లో నీళ్లు నిండుగా నిండాయి అదే కుంటలో కొంతమంది సాగుచేసిన పొలాలు మునిగిపోతున్నాయని తూమును పగలగొట్టి నీళ్లను మోరి గేట్ల ద్వారా అక్రమంగా నీరును వదులుతున్నారు దీనివలన రాబోయే ఎండాకాలంలో కుంట కింద ఉన్న బోర్లు నీళ్లు పోయవని సీతారాం తండా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి పై ఉన్నత అధికారులు ఎమ్మార్వో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే చర్య తీసుకొవాలని కోరారు