మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జై కిషన్ ఓజా

కమిషనర్ కళాశాల విద్య  ఉత్తర్వుల మేరకు  ప్రిన్సిపల్ గా డాక్టర్. జై కిషన్ ఓజా మంగళవారం  బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలోని వసతులను, సదుపాయాలను, గ్రంథాలయాన్ని, ల్యాబ్ లను పరిశీలించి విద్యార్థులు అధ్యాపకులతో సమావేశం అయ్యారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం మరియు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొండెల మారుతి విద్యార్థి నాయకుడు దిగంబర్ ప్రిన్సిపాల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ కళాశాల నుండి ఇటీవల బదిలీ అయిన తాహిర్ హుస్సేన్ , డాక్టర్. భరత్ , ఐక్యుఏసీ కోఆర్డినేటర్ కృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ పరిశయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందము, మానస, రజిత, అధ్యాపకేతర సిబ్బంది అశోక్, శ్రీనివాస్, సుధాకర్ ,ముజాహిద్, రాజు, దుర్గరాజు, సురేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment