సమగ్ర ఇంటింటి సర్వే డేటా ఎంట్రీ లో తప్పులు దొర్ల వద్దు

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ లో తప్పులు దొర్ల వద్దని  మంథని డివిజనల్ పంచాయతీ అధికారి (డీ.ఎల్.పీ.ఓ) కొమ్మేర సతీష్ కోరారు. ఈ మేరకు రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న డేటా ఎంట్రీ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. రామగిరి మండలంలో  ప్రభుత్వము సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే  అంశాలపై సర్వే నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో రామగిరి మండలంలో 17 గ్రామాలలో సర్వేను 102 మంది ఏనుమ్యూరేటర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ బద్రి శైలాజ రాణి, ఎంపీఓ దేవరకొండ ఉమేష్,ఐసీడీఎస్  సూపర వైజర్ లు పల్లె అనిత, పర్కల శారదా, డిప్యూటీ తహసీల్దార్ యజ్ఞంబట్ల మానస, మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్, ఆర్.ఐ లు కే. మహేష్,రెవెళ్లి నిహారిక, ఐకేపీ ఏపీఎం గొట్టే స్వరూప రాణి, గ్రిడ్ ఏ.ఈ వాసవి, ఉపాధి ఈ.సీ రాసపల్లి లక్ష్మన్ లు ఆయా గ్రామాలలో సర్వే పనులను పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో రామగిరి మండలంలోని పూర్తి అయిన సర్వే ఫారంలను కంప్యూటర్ లో భద్రపరుస్తున్నారు. ఈ మేరకు గత మూడు రోజులుగా డేటా ఎంట్రీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. మండలంలో సర్వే దాదాపుగా పూర్తికా వచ్చింది. డోర్ లాక్ ఇల్లు  మినహా అన్ని గృహంల సర్వే పూర్తి అయిందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment